ప్రియాంక రెడ్డి హత్యకేసు : ఏ 1 నిందితుడి చరిత్ర .. నేరాల పుట్ట 

ప్రియాంక రెడ్డి హత్యకేసు : ఏ 1 నిందితుడి చరిత్ర .. నేరాల పుట్ట 

ప్రియాంక రెడ్డి హత్య కేసులో క్షణక్షణానికి ఓ అప్డేట్ బయటకు వస్తున్నది.  అత్యాచారం చేసిన తరువాత నిందితులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రియాంక రెడ్డి కళ్ళు తెరిచిందని చెప్పి ఆమెను హత్య చేశారు.  అసలు ఈ ఘటన జరగటానికి ప్రధాన కారకుడు ఏ1 నిందితుడు మహ్మద్ ఆరిఫ్ అని తేలింది.  మహ్మద్ ఆరిఫ్ చరిత్ర గురించి తెలుసుకుంటే జీవితం మొత్తం కూడా నేరాల మయంగానే ఉన్నది.  

ఆరిఫ్ పదోతరగతి వరకు చదువుకున్నాడు.  మొదట 2010లో పదోతరగతి పూర్తి చేసిన ఆరిఫ్ ఆ తరువాత 2012 నుంచి 2015 వరకు కూకట్ పల్లిలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేశారు.  ఆ తరువాత 2016లో సొంతవూరు జక్లేరులో పెట్రోల్ బ్యాంకులో పనిచేశారు.  అయితే, అదే ఏడాది చివర్లో శ్రీనివాస్ రెడ్డికి చెందిన లారీలో క్లినర్ గా చేరాడు.  తక్కువ సమయంలోనే లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు.  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే లారీ డ్రైవ్ చేస్తున్నాడు.  నవంబర్ 21 వ తేదీన ఇనుప కడ్డీల లోడ్ ను కర్ణాటకలోని రాయ్ చూర్ కు తీసుకెళ్లారు.  ఆ లోడ్ లో నుంచి కొన్ని ఇసుప కడ్డీలను దొంగతనం చేసి వేరే చోట దాచిపెట్టారు.  నవంబర్ 24 వ తేదీన ఇటుకల లోడ్ వేసుకొని హైదరాబాద్ కు తిరుగుప్రయాణం అయ్యాడు.  అయితే, 26 వ తేదీన మహబూబ్ నగర్ ఒకటో నెంబర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆరిఫ్ లారీని ఆర్డీవో అధికారులు పట్టుకున్నారు.  ఓవర్ లోడ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పి లారీని ఆపగా, ఎలాగైనా అక్కడి నుంచి రావాలని ఓనర్ ఆదేశించడంతో.. సేఫ్ స్టార్ట్ వైర్ ను పీకేశాడు.  బండి స్టార్ట్ కాకపోవడంతో ఆర్డీవో అధికారులు లారీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.  ఆ తరువాత ఆరిఫ్ బండి స్టార్ట్ చేసి అక్కడి నుంచి వచ్చేశారు.  నవంబర్ 26 వ తేదీ తెల్లవారు జామున తన మిత్రులు చెన్నకేశవులు, శివలు వచ్చారు.  అక్కడి నుంచి వారు దొంగతనం చేసిన ఇనుప కడ్డీలను తీసుకొని రాయికల్ టోల్ ప్లాజాకు చేరుకొని అక్కడే వాటిని అమ్మారు.  దీంతో వారికీ 4వేలు వచ్చాయి.  అక్కడి నుంచి లారీని సాయంత్రం 5:30 గంటలకు ఓఆర్ఆర్ తోడుపల్లి టోల్ ప్లాజా వద్దకు తీసుకొచ్చి ఆపారు.  అప్పటి చేతిలో 4వేలు ఉన్నాయి.  మద్యం తెచ్చుకొని తాగారు..  సాయంత్రం 6 గంటల సమయంలో ప్రియాంక రెడ్డి అక్కడి వచ్చి స్కూటీ స్టాండ్ వేయడం చూసి ప్లాన్ చేసి ఆమెపై అత్యచారం హత్య చేశారు.