క్రాక్ స్ట్రీమింగ్ నిజమేనా..?

క్రాక్ స్ట్రీమింగ్ నిజమేనా..?

మాస్ మహరాజ లేటెస్ట్ సినిమా క్రాక్. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. జనవరీ9న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు చేస్తూనే ఉంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసిందన్న విషయం పక్కా అయింది. ఇప్పటికే తన టార్గెట్ అందుకున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం మరో గాసిస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిన ఆహా చిత్రాన్ని ఈ నెలలోనే తన యాప్‌లో స్ట్రీమింగ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాతో శ్రుతిహాసన్ చిత్ర సీమలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రముఖ దర్శకుడు సముద్రఖని విలన్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం సంక్రాంతికి విడులైన సినిమాల్లో అత్యదిక వసూళ్లు చేసిని సినిమాగా నిలిచింది. ఈ సినిమా అభిమానుల అంచనాలను మించి అలరించింది.