పాటల రచయితకు రాజమౌళి షాకింగ్ నిబంధనలు
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు. సినిమా నుంచి ఫోటోలు బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలోని స్టిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారి లుక్ ను ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. అందరి దృష్టి ఎన్టీఆర్ ఇందులో కొమరం భీం గా ఎలా ఉండబోతున్నారు. ఏ లుక్ లో ఉండబోతున్నారు. అన్నది సస్పెన్స్ గా మారింది.
ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుశా కొమరం భీం జయంతి రోజైన రేపు ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఇక ఇదిలా ఉంటె, ఇందులో మూడు సాంగ్స్ ను సుద్దాల అశోక్ తేజ రాస్తున్నారు. సుద్దాలతో సాంగ్ అంటే పాత్ర తీరు తెన్నులు క్షుణ్ణంగా చెప్పాలి. అన్ని వివరిస్తేనే అయన పాట రాస్తారు. సో, ఇందులో మూడు పాటలు సుద్దాల రాస్తున్నారు అంటే సినిమాకు సంబంధించిన చాలా స్టోరీ ఆయనకు తెలిసి ఉంటుంది. అందుకే రాజమౌళి ఆయనకు ఓ నిబంధన పెట్టారట. అదేమంటే.. ఇందులో సాంగ్స్ కు సంబంధించిన ఎలాంటి విషయాలు కట్టుకున్న భార్యకు కూడా తెలియకూడదు అని ఖచ్చితంగా చెప్పినట్టు సుద్దాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాబోతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)