ఎన్టీఆర్, చరణ్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి?

ఎన్టీఆర్, చరణ్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి?

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  వీరికి సంబంధించిన లుక్ ను దసరా సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.  ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపిస్తుంటే.. చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నారు.  గూడెం పెరిగిన కొమరం భీం ఎక్కువగా తలపాగాతోనే ఉండటం తెలుసు.  ఇందులో ఎన్టీఆర్ ను అలానే చూపిస్తున్నారని తెలుస్తోంది.  

అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు.  అల్లూరు సీతారామ రాజు పొడవైన జుట్టు, గడ్డంతో సంగతి తెలిసిందే.  కానీ, బయట ఎన్టీఆర్ అలా కనిపించడం లేదు.  రామ్ చరణ్ క్యాజువల్ లుక్ తో సాధారణంగా ఉండటంతో ..సీతారామ రాజును కొత్తగా చూపించబోతున్నారని అర్ధం అవుతున్నది.  వీరిద్దరి లుక్స్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.  ఈ లుక్స్ ఎలా ఉంటాయి అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.