శరీరం లోపల పెరిగిన పుట్టగొడుగులు...షాకైన వైద్యులు... 

శరీరం లోపల పెరిగిన పుట్టగొడుగులు...షాకైన వైద్యులు... 

పుట్ట‌గొడుగుల్లో మంచి పోష‌కాలు ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే.  వారంలో రెండు మూడు రోజులు ఆహారంలో వీటిని తీసుకుంటే, ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.  కొంత‌కాలంగా ఓ వ్య‌క్తి డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతుంటే, పుట్ట‌గోడుగుల‌ను తీసుకోమ‌ని సూచించార‌ట‌.  అయితే, పుట్ట‌గోడుగుల‌ను ఆహారంగా తీసుకోకుండా, జ్యూస్ మాదిరిగా మార్చి,  సిరంజ్ స‌హాయంతో శ‌రీరంలోకి ఎక్కించుకున్నాడు.  పుట్ట‌గొడుగుల జ్యూస్ శ‌రీరంలోకి ఎక్కించుకున్నాక అత‌ని శ‌రీరంలో పుట్ట‌గొడుగులు మొల‌కెత్త‌డం మొద‌లుపెట్టాయి. దీంతో శ‌రీరంలో అస్వ‌స్థ‌త క‌ల‌గ‌డంతో, వెంట‌నే ఆసుప‌త్రికి ప‌రుగులు తీశాడు.  శ‌రీరంలో పుట్ట‌గొడుగులు మొల‌కెత్త‌డం చూసి షాక్ అయ్యారు.  22 రోజుల‌పాటు క‌ష్ట‌ప‌డి శ‌రీరంలోని పుట్ట‌గొడుగుల‌ను తొల‌గించారు.  ఈ సంఘ‌ట‌న అమెరికాలోని నెబ్రాష్కాలో జ‌రిగింది.