నిర్మాతల పాలిట నిజంగానే 'విలన్స్' అవుతున్నారా...

నిర్మాతల పాలిట నిజంగానే 'విలన్స్' అవుతున్నారా...

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు హీరో హీరోయిన్స్ మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు విలన్స్ కూడా భారీగా పారితోషకాలు అందుకుంటున్నారు. కోవిడ్‌ టైమ్‌లో సూపర్‌ హీరో ఇమేజ్‌ తెచ్చుకున్న టాలీవుడ్‌ విలన్‌ సోనూ సూద్. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేస్తోన్న ఈ విలన్‌ కాల్షీట్స్‌ చాలా కాస్ట్లీ అని ప్రచారం జరుగుతోంది. సోనూ ఒక్క రోజుకి 20 లక్షల వరకు తీసుకుంటాడని, ఒక్క సినిమాకి 20 రోజులు వర్క్ చేస్తే నాలుగు కోట్ల వరకు చార్జ్‌ చేస్తాడని చెప్తున్నారు.టాలీవుడ్‌లో స్టైలిష్‌ విలన్‌గా సూపర్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న మాజీ హీరో జగపతి బాబు. హై ప్రొఫైల్‌ విలన్‌లా కనిపించే జగ్గూభాయ్‌ ఒక్కో సినిమాకి 3 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటాడని చెప్తున్నారు.పాజిటివ్‌ క్యారెక్టర్‌ అయినా నెగటివ్‌ క్యారెక్టర్‌ అయినా తన మార్క్ చూపించే యాక్టర్ ప్రకాశ్‌ రాజ్. సౌత్‌ నుంచి నార్త్‌ వరకు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేస్తోన్న ప్రకాశ్‌ రాజ్‌ ఒక్కో సినిమాకి 2 కోట్లకి పైగానే చార్జ్‌ చేస్తాడని చెప్తున్నారు.ఇలా కోట్లల్లో వసూల్ చేస్తూ నిర్మాతల పాలిట నిజంగానే విలన్స్ అవుతున్నారని అంటున్నారు కొందరు.