భయపెడుతున్న విజయ్ బిగిల్ రన్ టైమ్.. 

భయపెడుతున్న విజయ్ బిగిల్ రన్ టైమ్.. 

తలపతి విజయ్ బిగిల్ సినిమా ఈ దీపావళికి రిలీజ్ కాబోతున్నది.  అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  తేరి, మెర్సల్ సినిమాలు భారీ హిట్ కొట్టాయి.  ఈ కాంబినేషన్లో తెరకెక్కిన మూడో సినిమా బిగిల్.  ఫుట్ బాల్ కోచ్ గా, ఊర మాస్ వ్యక్తిగా రెండు పాత్రల్లో విజయ్ కనిపించబోతున్నాడు.  ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ వెర్షన్ కు సంబంధించి సెన్సార్ పూర్తయింది.  

అయితే, 179 నిమిషాల రన్ టైమ్ తో సినిమా ఫైనల్ సెన్సార్ అయ్యింది.  అంటే ఒక నిమిషం తక్కువగా మూడు గంటలు.  ఇంతసమయం పాటు సినిమా థియేటర్లో కూర్చోవాలి అంటే కష్టమే.  తమిళంలో అంటే విజయ్ స్టార్ హీరో కాబట్టి సరిపోతుంది.  కానీ, తెలుగులో విజయ్ సినిమా మూడు గంటలపాటు చూడాలి అంటే కొంచం కష్టమైన విషయం అని చెప్పాలి.  గత కొన్ని రోజులుగా తమిళ్ స్టార్ల సినిమాలు తెలుగులో ఫెయిల్ అవుతున్నాయి.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.  తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ కాబోతున్నది.