అమెరికాలోని యూనివర్సిటీలో కాల్పులు, ఏడుగురికి గాయాలు

అమెరికాలోని యూనివర్సిటీలో కాల్పులు, ఏడుగురికి గాయాలు

అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి గర్జించింది. మధ్య ఇండియానాలోని బాల్ స్టేట్ యూనివర్సిటీ ఆవరణ దగ్గర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అర్థరాత్రి 1 గంట తర్వాత జరిగినట్టు పోలీసులు చెప్పారు. క్యాంపస్ కు పశ్చిమాన ఒక హౌస్ పార్టీలో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్టు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. బాధితులలో కొందరు బాల్ స్టేట్ విద్యార్థులు. వారికి గాయాలైన తీరు, వాటి పరిస్థితి గురించి ఇంకా తెలియరాలేదు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడో తెలుసుకొనేందుకు దర్యాప్తు ప్రారంభించారు. క్యాంపస్ లోని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు.