తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు

తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు

ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో  5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30-40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాలలో కొన్నిచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

కోస్తాంధ్ర మరియు యానాంలలో ఈరోజు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30-40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో కొన్నిచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు కొన్నిచోట్ల.. రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.