శ్రద్దా కపూర్ ఫ్యామిలీ గత 56 సంవత్సరాలుగా..

శ్రద్దా కపూర్ ఫ్యామిలీ గత 56 సంవత్సరాలుగా..

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించిన హర్రర్ కామెడీ సినిమా స్త్రీ సూపర్ హిట్టయింది.  ఈ సినిమా విజయంతో శ్రద్దా ఆనందంలో మునిగిపోయింది.  గణేష్ చతుర్థి ముందు వచ్చిన విజయం కాబట్టి ఈ పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో అద్భుతంగా సెలెబ్రేట్ చేసుకున్నది. గత 56 సంవత్సరాలుగా గణేష్ చతుర్థి నాడు అందరు శ్రద్దా కపూర్ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో కలిసి అక్కడే పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.  ఈ ఆనవాయితీని ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నారు.  

ఎక్కడ ఉన్నా ఈ పండుగ సమయంలో అందరు ఒక్క చోటికి చేరి సెలెబ్రేట్ చేసుకుంటారట.  శ్రద్దా కపూర్ కూడా చిన్నతనం నుంచి ప్రతి సంవత్సరం ఈ వేడుకలకు హాజరవుతూ ఉంటుంది.  ఇలా సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోను శ్రద్దా తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.  కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ సింగర్ ఆశా భోస్లే, శక్తి కపూర్ కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.  ప్రస్తుతం శ్రద్దా కపూర్.. బాహుబలి హీరో ప్రభాస్ తో సాహో సినిమాలో యాక్ట్ చేస్తున్నది.