'ఆర్ఆర్ఆర్'లో ఆమె నటించడంలేదు !

'ఆర్ఆర్ఆర్'లో ఆమె నటించడంలేదు !

 

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'కు హీరోయిన్ కష్టాలు తప్పడంలేదు.  మొదట ఇందులో కథానాయికలుగా అలియాభట్, బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ అనుకున్నారు.  కానీ డైసీ ఎడ్గర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.  దీంతో ఆమె స్థానంలోకి బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ వస్తుందని వార్తలొచ్చాయి.  కానీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన శ్రద్దా రాజమౌళి సినిమాలో నటించే వీలు లేదని తెలుస్తోంది.  మరి జక్కన్న ఏ నటిని చూజ్ చేసుకుంటారో చూడాలి.