పెళ్ళికి రెడీ అవుతున్న సాహో బ్యూటీ..!!

పెళ్ళికి రెడీ అవుతున్న సాహో బ్యూటీ..!!

నార్త్ లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధా కపూర్ సాహో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఇందులో శ్రద్ధా  కపూర్ పవర్ఫుల్ కాప్ పాత్ర చేస్తున్నది.  

ఇప్పుడు శ్రద్దా కపూర్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.  అదేమంటే..శ్రద్దా కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  శ్రద్దా కపూర్ చిన్ననాటి స్నేహితుడు, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ ను వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

ఈ వార్తలపై ఆమె తండ్రి శక్తి కపూర్ స్పందించాడు.  ఇప్పట్లో శ్రద్దా కపూర్ పెళ్లి చేసుకోవడం లేదని, ఆమె దృష్టిమొత్తం తన కెరీర్ పైనే ఉందని చెప్పాడు.  సాహో తో పాటు శ్రద్ధా బాలీవుడ్ లో డాన్స్ మూవీ చేస్తున్నది.  ఈమూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కాబోతున్నది.