ప్రభాస్ హీరోయిన్ స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడింది..!!

ప్రభాస్ హీరోయిన్ స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడింది..!!

ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది సినిమా ప్రమోషన్ స్పీడ్ అందుకుంది.  ఇప్పటికే అనేక నగరాల్లో యూనిట్ ప్రచారం చేస్తున్నది. ప్రచారంతో పాటు మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ప్రభాస్ హీరోయిన్ శ్రద్దా కపూర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.  ఇందులో అనేక విషయాలు గురించి శ్రద్దా మీడియాతో పంచుకుంది.  

అమెరికాలో విశ్వవిద్యాలయంలో సైకాలజీ చదువుకునే సమయంలోనే సల్మాన్ ఖాన్ సినిమాలో అఫర్ వచ్చిందట.  కానీ, సల్మాన్ తో కలిసి నటించేందుకు శ్రద్దా అంగీకరించలేదట.  ఆ తరువాత బోస్టన్ నుంచి ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన తరువాత ఇండియాకు వచ్చినపుడు తన ఫోటోలను పేస్ బుక్ లో  అంబికా హిందుజా తీన్ పత్తి సినిమాలో అవకాశం ఇచ్చారు.  పాత్ర చిన్నదే అయినా అమితాబ్ వంటి నటుడితో కలిసి నటించడం కన్నా కావాల్సింది ఏముంది అని చెప్పి ఒకే చెప్పిందట శ్రద్దా.  ఈ సినిమా తరువాత ఆషిక్ 2 సినిమా అఫర్ వచ్చింది.  అదే తన మొదటి సినిమా అని అందరూ అనుకుంటున్నారని, అంతకు ముందు లవ్ కా ది ఎండ్ సినిమా చేసినట్టు చెప్పింది.  అయితే, ఆషిక్ 2 సినిమా అవకాశం రావడంతో యశ్ రాజ్ ఫిలిమ్స్ సినిమాను పక్కన పెట్టినట్టు చెప్పింది.  అయితే స్కూల్ డేస్ లో ఓ అబ్బాయిపై క్రష్ ఉండేదని.. అది ప్రేమో ఆకర్షణలో తెలియలేదని చెప్పింది.  ఆ తర్వాత తనకు ప్రేమించడానికి సమయం దొరకలేదని చెప్పింది శ్రద్దా.