'సాహో' సినిమా చేయడం చాలా కష్టంగా ఉంది - శ్రద్దా కపూర్

'సాహో' సినిమా చేయడం చాలా కష్టంగా ఉంది - శ్రద్దా కపూర్

ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా 'సాహో' చాలా కాలం నుండి షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.  సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడ రూపొందిస్తుండటంతో చిత్రీకరణ ఇంకా క్లిష్టంగా మారుతుంది.  ప్రస్తుతం ఈ 'సాహో' హీరోయిన్ శ్రద్దా కపూర్ ఇదే విషయాన్ని చెబుతోంది.

మామూలుగానే పెద్ద సినిమా, ఆపైన రెండు భాషల్లో అంటే ఇంకా కష్టంగా ఉంది.  షూటింగ్ కోసం చాలా సెట్ వర్క్, లొకేషన్ చేంజెస్ ఉన్నాయి.  ఒకటిన్నర సంవత్సరం నుండి షూటింగ్ చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ భామ.  సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.