ఆ సూపర్ హిట్ సీక్వెల్లో సమంతకు ఛాన్స్ లేదట..!!!

ఆ సూపర్ హిట్ సీక్వెల్లో సమంతకు ఛాన్స్ లేదట..!!!

సమంత.. వివాహం తరువాత కూడా హీరోయిన్ గా దూసుకుపోతున్న తార.  హీరోయిన్ గా పలు విజయవంతమైన సినిమాలు చేసినా వివాహం తరువాత ఆమె అందుకున్న విజయాలు చిరస్మరణీయం అని చెప్పాలి.  లేటెస్ట్ గా భర్త నాగచైతన్యతో కలిసి చేసిన మజిలీ మూవీ సూపర్ డూపర్ హిట్టైంది.  ఈ కాంబినేషన్ మరోసారి రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.  

ఇదిలా ఉంటె, సమంత ప్లేస్ ను కన్నడ నటి శ్రద్దా శ్రీనాధ్ కొట్టేసేటట్టుగా కనిపిస్తోంది.  జెర్సీ సినిమా సమయంలో సమంత గురించి శ్రద్ధ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు.  జెర్సీ హిట్ తరువాత తమిళంలో అజిత్ హీరోగా చేస్తున్న పింక్ రీమేక్ లో ఛాన్స్ దక్కించుకుంది.  దీంతో పాటు విశాల్ హీరోగా చేయబోతున్న అభిమన్యుడు సీక్వెల్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది.  అభిమన్యుడు సినిమాలో సమంత హీరోయిన్ గా చేసింది.  ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  విశాల్ తో పాటు సమంతకు మంచి పేరు వచ్చింది.  ఇప్పుడు సమంతను రీప్లేస్ చేసి ఆ స్థానంలో శ్రద్ధను తీసుకోబోతున్నారట.  మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.