ఆ టాటూ ఎందుకో రివీల్ చేసిన హీరోయిన్ !

ఆ టాటూ ఎందుకో రివీల్ చేసిన హీరోయిన్ !

తమిళం, కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్.  నాని నటించిన 'జెర్సీ' సినిమాతో ఇటీవలే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చారామె.  ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు.  దాంతో అన్ని సామాజిక మాధ్యమాల్లో ఆమెను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు.  ఆమె ఇన్స్టాలోని కొన్ని ఫోటోలను చూసిన అభిమానులు ఆమె మెడ కింది ఎడమ భాగంపై ఉన్న టాటూని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.  ఆ టాటూ వెనకున్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తి చూపారు. 

తాజాగా తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ టాటూ గురించి మాట్లాడారు శ్రద్దా.  అది  ప్రముఖ రాక్ బ్యాండ్ బీటిల్స్ టాటూ అని, ఆ బ్యాండ్ అంటే తనకు చాలా ఇష్టమని, తాను మొదటగా సంపాదించిన డబ్బుతో ఆ టాటూ వేయించుకున్నానని అసలు సంగతి రివీల్ చేశారు.  ఇకపోతే ప్రస్తుతం ఈమె హిందీ హిట్ చిత్రం 'పింక్' యొక్క తమిళ రీమేక్లో నటిస్తున్నారు.