భారత యువ క్రికెటర్ కు 12 లక్షల జరిమానా...

భారత యువ క్రికెటర్ కు 12 లక్షల జరిమానా...

భారత యువ క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్‌ కు 12 లక్షల జరిమానా పడింది. అయితే ఐపీఎల్ 2020 లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్‌ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ జట్టు వేయాల్సిన 20 ఓవర్లను నిర్ణయిత సమయంలో వేయలేదు. అనుకున్న సమయానికి ఒక ఓవర్ తక్కువగా బౌలింగ్ చేయడంతో స్లో ఓవర్ రేట్ నియమాల ప్రకారం జట్టు కెప్టెన్ అయిన అయ్యర్‌ కి రూ. 12 లక్షల జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంతకముందు ఈ కారణంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి కూడా 12 లక్షల జరిమానా పడింది. ఇదిలా ఉంటె.. నిన్నటి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై ఢిల్లీ ఓడిపోయింది. మొదట  బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 162 పరుగులు చేయగా అందులో బెయిర్‌స్టో అర్ధ శతకం సాధించాడు. ఇక ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఢిల్లీని హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ కలిసి బోల్తా కొట్టించడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దాంతో ఐపీఎల్ 2020 లో సన్ రైజర్స్ హైదరాబాద్ 15 పరుగుల తేడాతో మొదటి విజయం నమోదుచేసింది.