గంగూలీకి సమస్యగా మారిన శ్రేయాస్ అయ్యర్ వ్యాఖ్యలు...

గంగూలీకి సమస్యగా మారిన శ్రేయాస్ అయ్యర్ వ్యాఖ్యలు...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సమస్యగా మారాయి. బీసీసీఐ బాస్ గా గంగూలీ వెనుకనుండి ఢిల్లీ జట్టును నడిపిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2020 లో మొదటి మ్యాచ్ ఢిల్లీ  పంజాబ్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్ టాస్ సమయం లో ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ మాట్లాడుతూ... మార్గ నిర్ధేశం చేయడానికి ఈ ఏడాది నాకు తోడుగా రికీ పాంటింగ్, గంగూలీ ఉండటం నా అదృష్టం. గంగూలీ మా జట్టు మొత్తానికి తోడుగా ఉన్నాడు అని తెలిపాడు. ఈ మాటలే ఇప్పుడు దాదాను ఇరుకున పడేస్తున్నాయి. శ్రేయాస్ చేసిన వ్యాఖ్యలు ఇతర ఐపీఎల్ ఫ్రాంఛైజ్ లతో పాటుగా మిగిత బీసీసీఐ అధికారులకు నచ్చడం లేదు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటూ ఐపీఎల్ లో ఓ జట్టుకు సహాయం చేయడం ఏంటి అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ గా గంగూలీ ఉన్నాడు. కానీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టిన తర్వాత ఆ మెంటర్ పదవిని వదిలిపెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు శ్రేయాస్ మాటలనుబట్టి చూస్తే దాదా ఇంకా ఢిల్లీ జట్టుకు మెంటర్ వ్యవరిస్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి.