తెలుగు `లస్ట్ స్టోరీస్` ..  అంతకు మించి అంటున్నారే

తెలుగు `లస్ట్ స్టోరీస్` ..  అంతకు మించి అంటున్నారే

కరోనా లాక్ డౌన్ సమయంలో లాభం పొందినవి ఏమైనా ఉన్నాయా అంటే అవి కేవలం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ మాత్రమే అవి కూడా వెబ్ సిరీస్ ల కారణంగా. అయితే ఇప్పుడు వీటికి మంచి క్రేజ్ ఉండటంతో చాలామంది హీరోయిన్లు వెబ్ సిరీస్ లో అడుగు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో వస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ ల'స్ట్‌ స్టోరీస్' రీమేక్ . హిందీలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్ లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది కియారా అద్వానీ. అయితే ఇప్పుడు దీనిని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందుకోసం నలుగురు దర్శకులు నాలుగు ఎపిసోడ్స్ ను తెరకెక్కిస్తున్నారు . వారిలో నందిని రెడ్డి , సంకల్ప్ రెడ్డి , తరుణ్ భాస్కర్ తో పాటు మహానటి లాంటి సినిమాను అందించిన నాగ్ అశ్విన్ కూడా ఉండటం విశేషం . అయితే ఈ వెబ్ సిరీస్ ల్లో తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా నటిస్తుంది. కాగా కియార్ పాత్రలో శృతి హాసన్ నటిస్తుంది. లస్ట్ స్టోరీస్ లో కియారా గ్లామర్ షో  హైలైట్ అనే చెప్పాలి.  బోల్డ్ సన్నివేశాల్లో కియారా నటనకు  కుర్రకారు ఫిదా అయిపోయారు. అయితే కియారా పాత్రలో శ్రుతిహాసన్ రెచ్చిపోయి నటించిందట . హిందీ సిరీస్ కంటే తెలుగు సిరీస్ లో గ్లామర్ షో ఎక్కువగావుండే అవకాశం కనిపిస్తుంది . ప్రస్తుతం శృతి హాసన్ రవితేజ  హీరోగా వస్తున్న ' క్రాక్ ' సినిమాలో నటిస్తుంది.