శృతిహాసన్ వ్యాఖ్యలు వైరల్.. తల్లిదండ్రుల విడాకులపై ఇలా..!

శృతిహాసన్ వ్యాఖ్యలు వైరల్.. తల్లిదండ్రుల విడాకులపై ఇలా..!

లోకనాయకుడు కమల్‌హాసన్-సారిక విడాకులపై తాజాగా శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి... 1988లో పెళ్లి చేసుకున్న కమల్ హాసన్, సారిక.. 14 ఏళ్ల కాపురం తర్వాత 2002లో విడిపోయారు. వీరికి శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరు ఆడపిల్లలే.. అయితే.. సారికకు వీడాకులిచ్చిన తర్వాత ప్రముఖ నటి గౌతమితో డేటింగ్‌ చేశారు కమల్ హాసన్.. అనారోగ్యసమస్యలతో ఆమె సతమతమవుతోన్న సమయంలోనూ అండగా నిలిచారు.. ఆ తర్వాత వాళ్లుకూడా వీడిపోయారు. అయితే, విలక్షణ నటుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా కమల్ పెద్ద కూతురు శృతి హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి హాసన్.. తన తల్లిదండ్రుల విడాకుల వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ ప్రపంచంలో విడాకులు తీసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు.. అందులో మా అమ్మానాన్న కూడా ఉన్నారని.. వాళ్లిద్దరూ సెలబ్రిటీలు కాబట్టి బయటివారికి ఇది న్యూస్.. కానీ, మాకు ఇది న్యూస్ కాదని తేలికకా తీసుకోంది.. అసలు, వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించిన శృతి.. జీవితంలో సంతోషంగా ఉండే హక్కు ఇద్దరికీ ఉంది... పెళ్లి చేసుకుని వారిద్దరూ సంతోషంగా లేనప్పుడు విడిపోవడమే ఉత్తమం కదా అని వివరణ ఇచ్చింది. ఇక, నాకు తల్లిదండ్రులు కాకముందే వారిద్దరూ మనుషులు... వారు విడిపోయిన కొద్దిరోజులకే నాకు ఈ విషయం అర్థమైందని చెప్పుకొచ్చింది. అయితే, ఇద్దరు మనుషులు విడిపోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది.. ఇప్పుడు నేను కూడా పెద్దదాన్ని అయ్యాను.. ఒకరితో రిలేషన్‌షిప్ సెట్‌కానప్పుడు వదిలేయడమే మంచిది కదా? అని ప్రశ్నించింది. కాగా, ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. లోకనాయకుడు రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.