కోహ్లీ పేరిట అరుదైన రికార్డు.. బద్దలుకొట్టిన యంగ్ క్రికెటర్..!

కోహ్లీ పేరిట అరుదైన రికార్డు.. బద్దలుకొట్టిన యంగ్ క్రికెటర్..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన రికార్డును యంగ్ క్రికెటర్ బద్దలు కొట్టేశాడు.. రికార్డుల రారాజు పేరిట 10 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్నా అరుదైన రికార్డును భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తిరగరాశాడు.. వివరాల్లోకి వెళ్తే.. దేవధర్ ట్రోఫీ ఫైనల్‌లో కెప్టెన్‌గా వ్యవహించిన అత్యంత పిన్న వయస్కుడిగా విరాట్ రికార్డు సృష్టించాడు.. తన 21వ యేట 2009-10 సీజన్‌లో దేవధర్ ట్రోఫీ ఫైనల్‌లో నార్త్‌జోన్‌కు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు.. ఆ మ్యాచ్‌లో నార్త్‌జోన్ విజయం సాధించింది... అయితే, ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన దేవధర్ ట్రోఫీలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. 20 ఏళ్లకే ఈ బాధ్యలు తీసుకోవడంతో గతంలో కోహ్లీ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు.