ఆకర్షణలో.. శుభ్రాకర్షణ శక్తి వేరు..!!

ఆకర్షణలో.. శుభ్రాకర్షణ శక్తి వేరు..!!

నారా రోహిత్ ప్రతినిధి సినిమా చూసిన వాళ్లకు హీరోయిన్ శుభ్ర అయ్యప్ప గుర్తుండే ఉంటుంది.  మోడలింగ్ రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. ఈ సినిమా తరువాత యవ్వనం ఒక ఫాంటసీ అనే సినిమా చేసింది.  దీని తరువాత తమిళంలో ఓ మూవీ చేసిన పెద్దగా కలిసిరాలేదు.  మోడలింగ్ రంగం నుంచి వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  

నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ బిజీగా ఉండే శుభ్ర అయ్యప్ప రీసెంట్ గా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ప్రింటెడ్ బికినీలో ఓ ఓడపై కూర్చొని ఉన్న ఫోటో అది.  చుట్టూ నీళ్ళో.. దూరంగా జననివాసాలు.. ఈ ఫొటోకు గురుత్వాకర్షణ శక్తి కాస్త భిన్నంగా ఉండే గ్రహానికి వచ్చాను అని చెప్పి క్యాప్షన్ ఇచ్చింది.  హెవెన్ ఆన్ ఎర్త్ అని ట్యాగ్ చేసింది.  ఈ ఫోటోను చూసిన వ్యక్తులు ఎవరైనా సరే అలానే అనుకుంటారు.  గురుత్వాకర్షణ శక్తి ఎక్కడో లేదు.. శుభ్ర అయ్యప్పలోనే ఉందని తప్పకుండా నమ్ముతారు.