శ్యామ్ సింగరాయ్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

శ్యామ్ సింగరాయ్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

నాచురల్ స్టార్ నాని తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాని గత సినిమా వీ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో తన తర్వాతి సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని నాని చూస్తున్నారు. అందులో భాగంగా నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలను ఓకే చేశారు. వీటిలో టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. వీటిలో శ్యామ్ సింగరాయ్ ప్రత్యేకం. నాని కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా శ్యామ్ సింగరాయ్ పాన్ ఇండియా రేంజ్ సినిమా అని కూడా టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం అభిమానులంతా ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు కొన్ని వార్తలు సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా టీజర్ ఉగాది పండగ సందర్భంగా విడుదల అవుతుందంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా టీజర్‌పై ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. త్వరలో టీజర్ రిలీజ్ ప్రకటిస్తారేమో వేచి చూడాలి.