ఏఆర్ రహమాన్ సినిమా కోసం సిడ్ శ్రీరామ్

ఏఆర్ రహమాన్ సినిమా కోసం సిడ్ శ్రీరామ్

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సొంతగా '99 సాంగ్స్' అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు ఆయనే కథను అందించారు.  ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ.  ఇందులో పాటలే ప్రధాన పాత్ర పోషించనున్నాయి.  చాలా రోజుల నుండి రహమాన్ పాటల రికార్డింగ్ చేస్తున్నారు.  ఈ పాటలని ప్రముఖ గాయనీ గాయకులు పాడుతున్నారు.  అందులో సిడ్ శ్రీరామ్ కూడా ఉన్నాడు.  ఆయన సినిమాలో 'జ్వాలాముఖి' అనే పాటను పాడుతున్నారు.  దానికి సంబంధించి ఆయన రిహార్సల్స్ చేస్తున్న వీడియో ఒకదాన్ని రహమాన్ తన ఇన్స్టాలో షేర్ చేశారు.   హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాను విశ్వేష్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేస్తున్నారు.