ఆ విషయంలో బీజేపీ ఎప్పటికీ విజయం దక్కదు..!

ఆ విషయంలో బీజేపీ ఎప్పటికీ విజయం దక్కదు..!

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో సంకీర్ణకూటమి అధికారాన్ని చేపట్టింది... అయితే, ఈ రెండు పార్టీల నేతల మధ్య పొసగడంలేదు.. త్వరలోనే ఆ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే వార్తలు ఎప్పటికప్పుడు ప్రసారమవుతూనే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నాలు లేవంటారు. అయితే, కర్ణాటకలో తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సిద్దరామయ్య... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వానికి వచ్చిన సమస్యేమి లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించిన ఆయన... అయినా వారు ఆ విషయంలో ఎప్పటికీ విజయం సాధించలేరని ధీమా వ్యక్తం చేశారు.