యడ్యూరప్పకు సిద్ధరామయ్య సవాల్...

యడ్యూరప్పకు సిద్ధరామయ్య సవాల్...

బీజేపీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. మెజార్టీ సభ్యులు తమవైపే ఉన్నారన్నారు. కర్ణాటకలో ప్రభుత్వంను ఏర్పాటు చేసేంత మెజార్టీ బీజేపీకి లేకున్నా.. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ప్రమాణస్వీకారం చేయడం దారుణం అని అన్నారు. ఇదే అంశంపై తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. బీజేపీ చేస్తున్న రాజకీయాలను ప్రజలకు తెలిజేస్తామన్నారు. యెడ్యూరప్ప తన మెజారిటీ నిరూపించుకోవాలనుకుంటే.. 112 మంది ఎమ్మెల్యేల పేర్లను  ముందుగా వెల్లడించాలని సవాల్ విసిరారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. బలపరీక్షకు 15 రోజుల గడువు ఉంది.