మహాసముద్రంలో శర్వాతో ఎవరో ప్రకటించిన చిత్రబృందం...

మహాసముద్రంలో శర్వాతో ఎవరో ప్రకటించిన చిత్రబృందం...

ఆర్ ఎక్స్100 సినిమాతో  సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈసినిమా తరవాత కొంత గ్యాప్ తీసుకున్న అజయ్ తన రెండో సినిమాకు మహాసముద్రం అనే పేరు పెట్టాడు . ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అనే ప్రచారం మొదటి నుండే సాగుతుంది. కానీ సినిమా ప్రకటించినప్పుడు శర్వానంద్ పేరు మాత్రమే చెప్పింది చిత్రబృందం. కానీ ఈ రోజు అందులో శర్వాతో ఎవరు నటించనున్నారు అనేది తెలిపింది. ఇందులో రెండో హీరోగా సిద్దార్థ్ నటించనున్నాడు అని ప్రకటించింది. అయితే సిద్దార్థ్ తెలుగులో స్ట్రైట్ సినిమా చాలా కాలం అయింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో యాక్షన్, డ్రామా, లవ్ ఉంటాయని అలాగే ఆర్ ఎక్స్ 100 తో హిట్ అందుకున్న అజయ్ ఇప్పుడు అంతకంటే సూపర్ హిట్ సినిమా తీయబోతున్నాడని ఇంతకముందే చిత్రబృందం తెలిపింది.