టిక్ టాక్ సింగర్ ఆత్మహత్య.!

టిక్ టాక్ సింగర్ ఆత్మహత్య.!

టిక్ టాక్ లో తన పాటతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న టిక్ టాక్ సింగర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా  కోడూరు మండలం గంగాపూర్‌ గ్రామానికి గడ్డం రాజు టిక్ టాక్ లో తన పాటలతో ఫేమస్ అయ్యాడు. కాగా అతడు ఆదివారం వ్యవసాయ పొలంవద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని ఇక రాడాని చెప్పుమ్మ’ అనే పాటతో రాజు టిక్ టాక్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతమంచి పాటతో రాఖీ పండగ గొప్ప తనాన్ని చెప్పిన రాజు రాఖీపండగ కు ఆత్మహత్య చేసుకోవటం అతడి అభిమానులను కలచివేసింది. రాజు ఆత్మహత్య చేసుకోవటంతో అతడి కుటుంబం విషాదంలోకి వెళ్ళిపోయింది. ఇక అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.