ఫోటో షూట్‌లతో వేడిపుట్టిస్తున్న పైసా బ్యూటీ..అందుకేనా..

ఫోటో షూట్‌లతో వేడిపుట్టిస్తున్న పైసా బ్యూటీ..అందుకేనా..

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన పైసా సినిమాతో టాలీవుడ్‌కు కొత్త హీరోయిన్ శ్రద్ధా శర్మ పరిచయం అయింది. కానీ ఈ సినిమా డిసాస్టర్‌గా మిగలడంతో అమ్మడు అవకాశాలు ఆవిరయ్యాయి. ఈ సినిమాలో వచ్చిరాని తెలుగుతో అందరిని ఆకట్టుకుంది. దాంతో అమ్మడు టాలీవుడ్‌‌లో హీరోయిన్‌గా స్థిరపడుద్దని అందరూ అనుకున్నారు. కానీ బొమ్మ మారి ఆ సినిమా తరువాత అసలు అవకాశాలు రాలేదు. తరువాత ఒక్క అవకాశం కూడా లేకపోవడంతో మళ్లీ నార్త్ ఇండియాకు ప్రయాణం చేసింది. ఈ అమ్మడు అక్కడ కూడా అంత ఫేమస్ కాదు. అయతే టాలీవుడ్ నుంచి తప్పుకున్నప్పటికీ తన అభిమానులతో ఈ ముద్దుగుమ్మ టచ్‌లోనే ఉంది. తన హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది. బీచ్‌లో బికీనీ ఫొటోలతో కుర్రకారుని కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు పంజాబీ మోడలింగ్‌లో కాస్త బిజీగానే ఉంది. కానీ హీరోయిన్ అవకాశాల కోసం తన ఫోటో షూట్‌లను కొనసాగిస్తోంది. మరి కుర్రకారు గుండెల్లో గంటలు మోగిస్తూ తెగ వైరల్ అవుతున్న ఈ అమ్మడుకి ఐటెం సాంగ్‌లలో అయినా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.