పెళ్లికి కవితను ఆహ్వానించిన సిక్కిరెడ్డి

పెళ్లికి కవితను ఆహ్వానించిన సిక్కిరెడ్డి

అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి తన వివాహ మహోత్సవానికి హాజరుకావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించారు. బుధవారం సిక్కిరెడ్డి తనకు కాబోయే భర్త సుమీత్ రెడ్డితో కలిసి హైదరాబాదులో ఎంపీ కవితను కలిసి వారి పెళ్లి కార్డును అందజేశారు. ఈ సందర్భంగా కవిత వారికి శుభాకాంక్షలు తెలిపింది. సిక్కిరెడ్డి వివాహం ఈ నెల 23న రాత్రి 8:27 గంటలకు శంషాబాద్ లోని మల్లిక కన్వెన్షన్ లో జరగనుంది.