టీడీపీలో చేరిన వైసీపీ నేత సోదరుడు

టీడీపీలో చేరిన వైసీపీ నేత సోదరుడు

వైసీపీ నేత, కర్నూలు జిల్లాకు చెందిన మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా రాజగోపాల్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో రాజగోపాల్‌రెడ్డితోపాటు ఆయన కుమార్తె జ్యోతి, అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శిల్పా రాజగోపాల్ రెడ్డి చేరికతో జిల్లాలో టీడీపీ బలం పెరిగిందని భావిస్తున్నారు.