బెజవాడలో భారీగా వెండి స్వాధీనం

బెజవాడలో భారీగా వెండి స్వాధీనం

విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా వెండి స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా తమిళనాడుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 138 కిలోల వెండి దిమ్మలు, 3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితులు వాడిన కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.