ఎన్నాళ్లకు ఇలా ...

ఎన్నాళ్లకు ఇలా ...

కోలీవుడ్ మన్మధుడు ఎవరు అంటే శింబు అని అంటారు.  కొంతకాలం క్రితం వరకు కోలీవుడ్ లో శింబు సినిమాలతో చాలా బిజీ అయ్యారు.  ఎప్పుడైతే ప్రేమ, దోమ అంటూ తిరగడం ప్రారంభించాడో అప్పుడే పతనం మొదలైంది.  చాలా రోజులవరకు సినిమాలు లేవు.  వచ్చినా ఒకటి రెండు మాత్రమే.  అవి పెద్దగా ఆడేవి కాదు.  అయితే, పాత పద్ధతులకు స్వస్తి చెప్పి... కెరీర్ పై దృష్టి పెట్టాడు.  

శింబు... హన్సిక కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్నది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  శింబుతో కలిసి సినిమా చేసేది లేదన్న హన్సిక మనసు మార్చుకొని శింబుతో సినిమా  చేస్తుండటం విశేషం.