శింబు సినిమా మొత్తం చూపించేశాడు..!!

శింబు సినిమా మొత్తం చూపించేశాడు..!!

అత్తారింటిది దారేది సినిమా తెలుగులో ఎలాంటి హిట్ అయిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో శింబు హీరోగా వందరాజ వతన్ వరువేన్ గా తెరకెక్కుతున్నది.  సుందర్ సి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  రీమేక్ అయినప్పటికీ తమిళ నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు సుందర్ సినిమాను మార్పులు చేశారు.  

ఈ సినిమా టీజర్ ఈ ఉదయం రిలీజ్ అయింది.  టీజర్ అంటే ఆసక్తికరమైన కొన్ని పాయింట్స్ చూపించి సినిమాపై అంచనాలు పెంచాలి.  సుందర్ అందుకు విరుద్ధంగా సినిమాలో ఏం చూపించబోతున్నారో ఆ విషయాలు అన్నింటిని టీజర్ ద్వారా చెప్పేశారు.  2నిమిషాల 29 సెకండ్లపాటు ఉన్న ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ అన్ని రివీల్ చేశాడు.  ఎలాగో తెలుగులో సినిమా అందరు చూశారు కాబట్టి ఇంక దాచాల్సింది ఏముంటుంది.  అత్తారింటిది రీమేక్ ద్వారా శింబు తమిళంలో హిట్ కొట్టబోతున్నాడన్నమాట.