అచ్చంగా అలాగే..!!

అచ్చంగా అలాగే..!!

పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా టాలీవుడ్ లో అప్పట్లో మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.  త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, పవన్ సూపర్ యాక్టింగ్ తో సినిమా సూపర్ హిట్టైంది.  ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో సుందర్ సి వంత రాజవతన్ వరువేన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.  శింబు హీరో.  మేఘా ఆకాష్, క్యాథరిన్ థెరిసా లు హీరోయిన్లు.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నది.  

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నిన్న రాత్రి రిలీజ్ చేశారు.  పవన్ సినిమాను ఎలా రీమేక్ చేస్తారో అనుకున్నారు..చిన్న చిన్న మార్పులు మినహా దాదాపు అచ్చంగా అలాగే దించేశారు.  శింబు యాక్టింగ్ పరంగా మెప్పించినట్టే కనిపిస్తోంది.  కాకపోతే పవన్ స్మార్ట్ లుక్ తో కనిపిస్తే.. శింబు మాస్ లుక్ లో అల్ట్రా మోడ్రన్ గా కనిపించాడు.  తమిళ్ నేటివిటీకి తగ్గట్టుగా ఫైట్స్ ను కలర్ఫుల్ బ్యాగ్ గ్రౌండ్ లో షూట్ చేశారు.  ఫిబ్రవరి 1 వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోలీవడ్ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.  తెలుగులో ఈ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారా..? చూద్దాం.