రివ్యూ:  సింబా  

రివ్యూ:  సింబా  

నటీనటులు : రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, వైదేహి తదితరులు

సంగీతం : తనిష్క్ బాగ్చి 

ఫోటోగ్రఫి : జొమోన్ టి జాన్ 

నిర్మాత : ధర్మ ప్రొడక్షన్స్ 

దర్శకత్వం : రోహిత్ శెట్టి 

 

రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన సింబా సినిమా ఈరోజు రిలీజ్ అయింది.  టెంపర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం.    

కథ : 

రణ్వీర్ సింగ్ పోలీస్ అవ్వాలనే కసితో కష్టపడి పోలీస్ ఆఫీస్ అవుతాడు.  లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో రణ్వీర్ సింగ్ కు మెడికల్ స్టూడెంట్ సారా అలీఖాన్ పరిచయం అవుతుంది.  ఈ పరిచయం ప్రేమగా మారుతుంది.  సారా ద్వారా ఆమె ఫ్రెండ్ వైదేహి పరిచయం అవుతుంది.  మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కు సోనూసూద్ గ్యాంగ్ మత్తుమందు సరఫరా చేస్తుంటాడు.  ఈ విషయం తెలుసుకున్న వైదేహి ఎలాగైనా ఆ ముఠాను పట్టుకోవాలని పబ్ కు వెళ్తుంది.  పబ్ లో ఆమెను కిడ్నాప్ చేస్తారు.  అలా కిడ్నాపైన వైదేహిని రణ్వీర్ రక్షించాడా లేదా అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

టెంపర్ రీమేక్ అయినప్పటికీ కేవలం అందులోని యాక్షన్ పార్ట్ మాత్రమే తీసుకున్నామని రోహిత్ శెట్టి చెప్పినా.. సినిమా చూస్తుంటే.. టెంపర్ సినిమా చూస్తున్నట్టుగానే కనిపించింది.  టెంపర్ సీరియస్ గా సాగితే.. సింబాలో రోహిత్ శెట్టి తన మార్క్ కామెడీని మిక్స్ చేశారు.  సీరియస్ సీన్స్ లో సైతం కామెడీ చేయడం.. మధ్యమధ్యలో డ్యాన్స్ చేయడం వంటివి చేయడంతో లాజిక్ లేకుండా కథ నడిచింది.  అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు తప్పించి సినిమా దాదాపుగా టెంపర్ ను హిందీలో డబ్ చేసినట్టుగానే ఉంటుంది.  

నటీనటుల పనితీరు: 

సినిమా మొత్తానికి రణ్వీర్ సింగ్ హైలైట్ గా నిలిచాడు.  తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.   సీరియస్ సన్నివేశాల్లో కూడా కామెడీ మిక్స్ చేయడంతో .. ఎన్టీఆర్ లో కనిపించినంత ఆ మాస్ ఆటిట్యూడ్ రణ్వీర్ లో  కనిపించలేదు.   సారా  అలీఖాన్ పాత్రను అందంగా డిజైన్ చేశారు.  పాటలకు మాత్రమే పరిమితం అయింది.  సోనూసూద్, ప్రకాష్ రాజ్ లు మెప్పించారు.  

సాంకేతిక విశ్లేషణ : 

కామెడీ సినిమాలను దర్శకత్వం వహించే రోహిత్ శెట్టి సీరియస్ గా సాగే సినిమాను చేయడం సాహసంతో కూడుకున్నదే.  అతనిలోని పాత సినిమాల వాసన ఇందులోను కనిపించింది.  సీరియస్ సీన్స్ ను సీరియస్ గా తీసుంటే సినిమా మరోలా ఉండేది.  పాటలు బాగున్నాయి.  బ్యాగ్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంది.  జాన్ ఫొటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది.  ధర్మ ప్రొడక్షన్స్ విలువలు అందంగా ఉన్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

రణ్వీర్ సింగ్ నటన 

పాటలు 

ఫోటోగ్రఫి 

కథ 

నెగటివ్ పాయింట్స్ : 

సీరియస్ సీన్స్ లో కామెడీ 

లాజిక్ లేని సన్నివేశాలు 

చివరిగా :  సింబా - రణ్వీర్ వన్ మ్యాన్ షో