సిమ్రన్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదేనట..

సిమ్రన్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదేనట..

దాదాపు పదేళ్లు దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి సిమ్రన్‌.. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లిచేసుకుని తెర మరుగైంది. ఆ తరవాత కొన్నేళ్లు టీవీ సీరియల్స్‌లో మురిపించి.. మళ్లీ బ్రేకిచ్చింది. కాస్త విరామం తీసుకుని 'పేట'తో మళ్లీ తెరపైకి వచ్చింది. వయసు పెరిగినా అదే గ్లామర్‌ను మెయింటెయిన్‌ చేస్తూ ఫాన్స్‌ను ఫిదా చేసంది. ఆమెను ఈ సినిమాలో చూసిన వారంతా 'సిమ్రన్‌ అప్పుడెలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది' అంటూ ప్రశంసించారు. ఆహారం, వ్యాయామం, యోగాతోపాటు డ్యాన్స్‌... ఇవే తన ఫిట్‌నెస్‌ రహస్యాలు అని చెబుతోంది సిమ్రన్‌. వారంలో నాలుగురోజుల పాటు రెండు గంటల చొప్పున మాస్టర్‌ సమక్షంలో డ్యాన్స్‌ చేస్తానని చెప్పుకొచ్చింది. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండొచ్చని సిమ్రన్‌ చెబుతోంది.