50 లక్షల ఉద్యోగాలు పోయాయి

50 లక్షల ఉద్యోగాలు పోయాయి

ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు పోయాయని పలు పరిశోధనల్లో, గణాంకాల్లో తేలింది. తాజాగా ఓ ప్రముఖ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలోనూ ఇదే తేలింది. నోట్ల రద్దు తరవాత దేశ వ్యాప్తంగా ఏకంగా 50 లక్షలు  ఉద్యోగాలు పోయాయని ప్రముఖ ప్రైవేట్‌ యూనివర్సిటీ అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ పేర్కొంది. 2011 నుంచి దేశంలో నిరుద్యోగం పెరుగుతూ వచ్చిందని  'ద స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2019' నివేదికలో పేర్కొంది. 2016 నుంచి 2018 మధ్యకాలంలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గాయని, ఇదే సమయంలో నోట్ల రద్దు జరిగిన విషయాన్ని  నివేదికలో ప్రస్తావించారు. 'ద బిగినింగ్‌ ఆఫ్‌ ద డిక్లయిన్‌ ఇన్‌ జామ్స్‌' నోట్ల రద్దు తరువాతి కాలంలో స్పష్టంగా కన్పించిందని నివేదిక పేర్కొందది. 2000 నుంచి 2011 మధ్య ఉన్న నిరుద్యోగం 3 శాతం వరకు ఉండగా, 2018లో 6 శాతానికి అంటే రెట్టింపు అయ్యిందని నివేదిక పేర్కొంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ద ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) పిరమిడ్స్‌ ఆఫ్‌ సర్వేలోని డేటా ఆధారంగా ఈ పరిశోధన జరిపినట్లు వర్సిటీ పేర్కొంది. 2017-18లో దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ళ గరిష్ఠ స్థాయి 6.1 శాతానికి చేరిందని పేర్కొంది.