ఇండోనేషియా ఓపెన్ ఫైనల్ చేరిన సింధు

ఇండోనేషియా ఓపెన్ ఫైనల్ చేరిన సింధు

ఇండోనేసియా ఓపెన్‌లో భారత్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. జకార్తాలో జరిగుతున్న ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. ఇవాళ జరిగిన సెమీస్‌లో చైనాకి చెందిన వరల్డ్‌ నెం.2 చెన్ యుఫీపై 21-19, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. పైనల్‌లో చిరకాల ప్రత్యర్థి జపాన్‌ షట్లర్‌ యమగూచితో సింధు తలపడబోతోంది. నిన్న జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో జపాన్ షట్లర్ నొజోమి ఒకుహరాను 21-14, 21-7 తేడాతో ఓడించి టైటిల్‌కి చేరువైంది.