కాంబ్లీ భార్యపై సింగర్ తండ్రి ఫిర్యాదు...

కాంబ్లీ భార్యపై సింగర్ తండ్రి ఫిర్యాదు...

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు... బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న ముంబై ఇనార్బిట్ మాల్‌లో ఓ కార్యక్రమం జరిగింది... ఆ కార్యక్రమానికి తన భార్య ఆండ్రియాతో కలిసి మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ, అతని తండ్రి రాజ్‌కుమార్ తివారీ కూడా పాల్గొన్నారు. ఆండ్రియా... అంకిత్ మధ్య ఓ అంశంపై చర్చ సందర్భంగా వాదన జరగడంతో మాట మాట పెరిగి సహనం కోల్పోయిన ఆండ్రియా.. అంకిత్ పై చేయిచేసున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పీఎస్‌లో ఆండ్రియాపై ఫిర్యాదు చేశారు అంకిత్ తండ్రి. అయితే వినోద్ కాంబ్లీ దీనిపై మరోలా స్పందించాడు... ఆండ్రియా చేయి పట్టుకుని అంకిత్ అసభ్యకరంగా ప్రవర్తించటంతోనే చేయి చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. అంకిత్‌ తండ్రి కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేయగా... కాంబ్లీ, ఆయన భార్యగానీ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు.