మీరా చోప్రాకు సపోర్ట్ గా చిన్మయి ...

మీరా చోప్రాకు సపోర్ట్ గా చిన్మయి ...

ఎన్టీఆర్ అభిమానులు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి మీరా చోప్రా. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మీరా చోప్రా  సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ .. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదు అంటూ వ్యాఖ్యానించింది. మీ అభిమాన హీరో ఎవరూ అంటే మహేష్ బాబు అని సమాధానం ఇచ్చిన మీరా చోప్రా .. పవన్ కళ్యాణ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని పొగిడింది. కానీ ఎన్టీఆర్ ఎవరో మాత్రం తనకు తెలియదు అంటూ సమాధానము ఇచ్చింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్  మీరా పై మండిపడుతున్నారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా మీరా చోప్రాకు సపోర్ట్ గా సింగర్ చిన్మయి శ్రీపాద నిలిచింది. తనను  అసభ్యపదజాలంతో దూషించే వారిపై వెంటనే కేసు ఫైల్ చేయమని మీరా చోప్రాకు సూచింది. దానికి  మీరా రిప్లే ఇస్తూ " ఒకరిమీద అయితే ఇవ్వొచ్చు కానీ వేలలో అలాంటి మెసేజ్ లు వస్తున్నాయి'' అని రిప్లై ఇచ్చింది. దానికి చిన్మయి స్పందిస్తూ.. 'మీ అభిమానులను అడగండి మిమ్మల్ని బూతులు తిడుతున్నవారి స్క్రీన్ షాట్స్ అడిగి వారిపై లాయర్ సహాయంతో పోలీస్ కేసు ఫైల్ చెయ్యండి.  మీకు సపోర్ట్ గా నేనుఉంటాను' అని రిప్లై ఇచ్చింది. దాంతో మీరా చోప్రాను ఫాలో అయ్యే కొందరు అభిమానులు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ ను షేర్ చేస్తున్నారు.