బీజేపీలో చేరిన స్టార్‌ డ్యాన్సర్‌

బీజేపీలో చేరిన స్టార్‌ డ్యాన్సర్‌

ప్రముఖ సింగర్‌, డ్యాన్సర్ సప్నా చౌదరి ఎట్టకేలకు బీజేపీలో చేరారు. సప్నా చౌదరి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని ఆ మధ్య వార్తలు రాగా ఇవాళ అనూహ్యంగా కమలం గూటికి చేరారు. హర్యానాకు చెందిన సప్నా.. ఎన్నికల ముందు రాహుల్ గాంధీని కలిశారు. ప్రియాంకా గాంధీతో ఫొటో కూడా దిగారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారని రూమర్స్‌ వినిపించాయి. వీటన్నింటికీ చెక్‌ పెడుతూ.. ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారి సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌... సప్నా చౌదరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సింగర్‌, డ్యాన్సర్‌గానే కాకుండా  బిగ్‌ బాస్‌ 11 సీజన్‌లో పాల్గొన్న సప్నా చౌదరికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది.