అంగ‌రంగ వైభ‌వంగా సునీత వివాహం...

అంగ‌రంగ వైభ‌వంగా సునీత వివాహం...

సింగ‌ర్ సునీత వివాహం మ్యాంగో రామ్‌తో నిన్న హైద‌రాబాద్ శివారు శంషాబాద్‌లోని అమ్మ‌ప‌ల్లి దేవాల‌యంలో జ‌రిగింది.  ఆల‌య ప్రాంగ‌నంలో జ‌రిగిన ఈ వివాహానికి సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు హ‌జ‌ర‌య్యారు.  అమ్మ‌ప‌ల్లి సీతారామ‌చంద్ర‌స్వామి దేవాల‌యం ప్రాంగ‌నాన్ని పెళ్లిమండ‌పంగా అద్భుతంగా తీర్చి దిద్దారు.  ఈ వివాహానికి రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, హీరో నితిన్‌లు హాజ‌ర‌య్యారు.  నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.  తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత మంచిపేరు తెచ్చుకున్నారు.  ప్ర‌స్తుతం సునీత వివాహానికి సంబందించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.