కరోనా నుంచి కోలుకున్న ప్రముఖ సింగర్

కరోనా నుంచి కోలుకున్న ప్రముఖ సింగర్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కరోనా కమ్మేస్తోంది. పెద్ద నటీనటుల నుంచి చిన్నవాళ్ల వరకు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కుటుంబంతో పాటు రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కరోనాను జయించారు.ప్రస్తుతం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం, నవనీత కౌర్ రానా కరోనాతో పోరాడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ సునీత తనకు కరోనా నిర్ధారణ అయినట్టు వీడియో సందేశంలో తెలిపింది. షూటింగ్ సమయంలో  తలనొప్పి రావడంతో టెస్ట్ చేయించుకోగా పోసిటీవ్ అని నిర్దారణ అయ్యిందని తెలిపారు . తాజా సమాచారం  ఆమె కరోనా నుంచి కోలుకున్నారని తెలుస్తుంది. తన ఆరోగ్యంపై సునీత మాట్లాడుతూ..పాజిటివ్ గా నిర్దారణ అయిన తర్వాత హోం ఐసోలేషన్ లో ఉంటూ..వైద్యుల సలహాలతో త్వరగా కోలుకున్నట్టు వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన అభిమానులకు సునీత ధన్యవాదాలు తెలియజేశారు.