ఇంటికొచ్చి రేప్ చేస్తా... సింగర్‌కు ఉబెర్ డ్రైవర్ బెదిరింపు...

ఇంటికొచ్చి రేప్ చేస్తా... సింగర్‌కు ఉబెర్ డ్రైవర్ బెదిరింపు...

కఠినమైన చట్టాలు వస్తున్నా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు ఆగడం లేదు... తాజాగా కోల్‌కతాలో ఓ గాయకురాలికి చేదు అనుభవం ఎదురైంది... తన సమీప బంధువుతో కలిసి బయటకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్‌ను బుక్ చేశారు సదరు గాయని... కారు రన్నింగ్‌లో ఉన్న సమయంలో డ్రైవర్‌కు పలుమార్లు ఫోన్ రావడాన్ని గమనించిన సింగర్... డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదని... ఫోన్ స్విచాఫ్ చేయాల్సిందిగా కోరారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఉబెర్ డ్రైవర్ నోరు మూసుకొని కూర్చోవాలని సింగర్‌ను బెదిరించాడు... అంతటితో ఆగకుండా లేదంటే ఇంటికొచ్చి రేప్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన సింగర్... ట్రాపిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగగానే విషయం ట్రాఫిక్ పోలీసుకు చెప్పింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. మరోవైపు సదరు సింగర్‌కు ఈ ఘటనపై ఉబెర్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. డ్రైవర్‌పై కఠిన చర్యలుంటాయని ప్రకటించింది.