ఫోటో అఫ్ ది డే : వనంలో ఒంటరిగా..!! 

ఫోటో అఫ్ ది డే : వనంలో ఒంటరిగా..!! 

విశ్వంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.  ప్రతి ఒక్కటి దేనికంటే కొత్తగా వింతగా ఉంటుంది. అలాంటి వింతల్లో ఒకటి ఇది.  విశాలమైన ప్రపంచంలో ఒంటరిగా కాసేపు ఉండాలంటే ఉండలేము.  ఒంటరిగా జీవితాంతం జీవించాలంటే కూడా జీవించలేము.  ఒంటరిగా ఉండటానికి మనమేమి చెట్టు చేమలు కాదుకదా అంటారు.  నగరాల్లో అయితే.. అక్కడొక చెట్టు అక్కడొక చెట్టు దర్శనం ఇస్తుంది కాబట్టి అలాంటి మాటలు అనొచ్చు.  

కానీ, విశాలమైన ప్రదేశంలో చుట్టూ పెద్ద అడవిలో ఒంటరి చెట్టును ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అంటే లేదని అంటారు.  అడవి అంటేనే చెట్ల సమూహం.  చెట్లు లేకుంటే అడవి ఎలా అవుతుంది.  కానీ, అది అడవే.. కాకపోతే, చెట్లు దూరంగా ఉన్నాయి.. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.