మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... కెప్టెన్ రూట్ ఔట్... 

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... కెప్టెన్ రూట్ ఔట్... 

భారత్ తో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. కేవలం 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే భారత స్పిన్నర్ అక్షత్ పటేల్ వరుస ఓవర్లలో ఇంగ్లాండ్ ఓపెనర్లను పెవిలియన్ కు చేర్చగా ఇప్పుడు భారత యువ పేసర్ సిరాజ్ ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్(5) ను వెనక్కి పంపాడు. దాంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ 30/3 తో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న మేతేరా పిచ్ గత మ్యాచ్ లో స్పిన్ కు బాగా అనుకూలించింది. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అంతగా బాల్ టర్న్ కావడం లేదు అనే చెప్పాలి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.