సిరివెన్నెల ఇంట పెళ్ళిసందడి

సిరివెన్నెల ఇంట పెళ్ళిసందడి

సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా  వివాహం వెంకటలక్ష్మి హిమబిందు తో 31-10-2020 ఉదయం హైదరాబాద్ లోని హోటల్ దస్ పల్ల లో నిమిషాలకు జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజా అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్‌, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, రణరంగం వంటి చిత్రాలలో నటించాడు.