బావిలో దూకిన చెల్లి.. కాపాడానికి వెళ్లి ఇద్దరు సోదరులు..

బావిలో దూకిన చెల్లి.. కాపాడానికి వెళ్లి ఇద్దరు సోదరులు..

వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతి ఇంట్లో గొడవపడి ఆవేశంతో వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా... ఆమెను కాపాడేందుకు బావిలోకి దిగిన ఇద్దరు సోదరులు కూడా మృతి చెందారు.  మృతులు జ్యోతి (16), రమేష్ (19), సంజీవ్ (23)గా గుర్తించారు. ఒకేసారి ముగ్గురూ మృతిచెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో కూడా విషాదం నెలకొంది. సెల్‌ఫోన్ విషయంలో గొడవే చెల్లి, ఇద్దరు అన్నల మృతికి కారణంగా తెలుస్తోంది. ఇక బావిలో నీటి కంటే బురద ఎక్కువగా ఉండటం కూడా వీరి మృతికి కారణమని గ్రామస్థులు అంటున్నారు.