ఐటీ గ్రిడ్స్‌లో ముగిసిన సోదాలు..

ఐటీ గ్రిడ్స్‌లో ముగిసిన సోదాలు..

ఏపీ, తెలంగాణ మధ్య తీవ్ర వివాదంగా మారిన డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు దూకుడుగా సాగుతోంది. ఐటీ గ్రిడ్స్ సంస్థలో సీన్ రీ కన్‌స్టక్షన్ చేస్తున్నట్టు ఇప్పటికే సిట్ ఇంచార్జ్ స్టీఫెన్ రవీంద్ర తెలపగా... ఇవాళ మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కార్యాలయంలో సిట్ సోదాలు ముగిశాయి. దాదాపు 10 గంటల పాటు కొనసాగిన సిట్ బృందం సోదాలు కొనసాగాయి. సిట్ అధికారులు, క్లూస్ టీం, టెక్నీకల్ అనాలిస్టులు, సైబర్ నిపుణుల సమక్షంలో డేటా విశ్లేషణ కొనసాగినట్టు తెలుస్తోంది. సీజ్ చేసిన కంప్యూటర్లు, సర్వర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను గోషామహాల్‌లోని సిట్ కార్యాలయానికి తరలించారు పోలీసులు. దీంతో ఆదివారం నుండి గోషామహల్ స్టేడియంలో సిట్ విచారణ కొనసాగనుంది.